- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖిల్లామైసమ్మ దేవాలయంలో ప్రోటోకాల్ రగడ!.. నేలపై కూర్చొని నిరసన తెలిపిన మాజీ మంత్రి
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రోటోకాల్ రగడ తారా స్థాయికి చేరింది.అధికారుల తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో సోమవారం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం చెక్కుల పంపిణీ చేసే సమయంలో అధికారులు కాంగ్రెస్ నాయకుడ్ని వేదిక పైకి ఆహ్వానించారు. దీనిపై సబిత ఇంద్రారెడ్డి.. ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదిక పైకి ఆహ్వానించవద్దని, అలా చేస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి కార్యక్రమం వద్దనే బైటాయించారు. వేదిక ముందు నేలపై కూర్చొని నిరసనకు దిగారు. ఒకపక్క BRS ఆందోళన లు కొనసాగిస్తుండగా.. మరో పక్క దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు భద్రత నడుమ ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబందించిన చెక్కులను పంపిణి చేశారు.