తాగునీటి కోసం మూగజీవాల విలవిల..

by Kalyani |
తాగునీటి కోసం మూగజీవాల విలవిల..
X

దిశ, నవాబుపేట: ప్రశ్నించే తత్వమున్న ప్రజలకు మిషన్ భగీరథ లాంటి పథకాల ద్వారా తాగునీటిని అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూగజీవాల దాహార్తిని తీర్చడం కోసం ఎలాంటి సదుపాయాలను కల్పించకపోవడంతో అవి దాహంతో విలవిలలాడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పశువుల దాహార్తిని తీర్చడం కోసం గ్రామాలలో నీటితొట్టెలను నిర్మించేవి.

అవి అందుబాటులో ఉన్న కాలంలో పశువులతో పాటు గ్రామాలలోని ఇతర మూగజీవాలు కూడా వాటిలో లభించే నీటితో దాహం తీర్చుకునేవి. ప్రస్తుతం అవి కనుమరుగు కావడంతో మూగజీవాలు దాహార్తి తీర్చుకోవడం కోసం అనేక ప్రయాసలు పడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూగజీవాల దాహార్తిని తీర్చడం కోసం గ్రామాలలో వాటికి తాగునీటి సౌలభ్యతను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed