- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్: సెక్రటేరియట్‌లోని గుడి, చర్చి, మసీద్ ప్రారంభోత్సవ డేట్ ఫిక్స్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలోని ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్ట్ 25వ తేదీన సచివాలయంలోని దేవస్థానం, మసీదు, చర్చి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సెక్రటేరియట్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో సచివాలయంలోని మూడు ప్రార్థనా మందిరాలను ఒకేరోజు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మూడు మతాల పెద్దలను సంప్రదించి ఆగస్ట్ 25వ తేదీని సీఎం కేసీఆర్ ఫిక్స్ చేశారు. ఆయా మతాల సంప్రదాయం ప్రకారం ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. పోచమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసి.. దేవాలయాన్ని పునః ప్రారభించనున్నట్లు సమాచారం.
Next Story