- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎమ్మెల్సీ కవితకు నోటీసులు విపక్షాలను వేధించడమే’
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవేనని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించిన వాళ్ళ పట్ల బీజేపీ సర్కార్ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళల హక్కులు, రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత 10వ తేదీన దీక్ష చేస్తున్నదనే ఉద్దేశ్యంతోనే ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. విపక్షాలను రూపుమాపేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు తెచ్చుకోవాలని, ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచి, గల్లీ గల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయాలని బీజేపీకి సూచించారు. శవాలను కూడా విచారించే నియమాలు తీసుకురండి.. అంటూ ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, కరెంట్, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ బీజేపీ ప్రభుత్వానికి అవసరం లేదని విమర్శించారు.