- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాప్స్, సంస్థల టైమింగ్స్ ప్రస్తుత నిబంధనలే కొనసాగును.. సిటీ పోలీస్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో దుకాణాలు రాత్రి 10:30 లేదా 11:00 గంటల్లోపు మూసివేయాలని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి అని పేర్కొంది. దుకాణాలు, సంస్థలు ఓపెన్, క్లోజ్ టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును అని, ఇది అందరూ గమనించగలరని ట్వీట్ లో స్పష్టం చేసింది.
దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దుకాణాలు రాత్రి 10:30 లేదా 11:00 గంటల్లోపు మూసివేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిందని, తర్వాత కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను డిలిట్ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ వ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు.