కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలి.. ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ నిర్ణయం

by Javid Pasha |
కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలి.. ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు అంగీకృత కార్యక్రమాలు రూపొందించుకొని ఐక్యం అవ్వాలని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ పిలుపునిచ్చారు. ఐక్యం అయ్యేంత వరకు కమ్యూనిస్టు‌లంతా కో-ఆర్డినేషన్ కమిటీ గా ఏర్పడాలని సూచించారు. ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ ముగింపు సమావేశంలో చండీఘఢ్ కిసాన్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసీపీఐ(యూ) దీర్ఘకాలంగా పని చేస్తున్న కమ్యూనిస్టులో ఐక్యత ప్రయత్నాల ఫలితంగా ఎంసీపీఐ(యూ)- ఆర్ఎంపీఐ పార్టీలతో కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సీసీసీ) ఏర్పాటు చేశామని ప్రకటించారు.

రానున్న కాలంలో ఈ కమిటీ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలను ఐక్యత చేస్తూ దేశంలో సామాజిక పోరాటాలు చేస్తామన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పేరియార్ రామస్వామి, షహీద్ భగత్ సింగ్ స్పూర్తితో సమగ్ర విప్లవ పంథా‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) పోలిట్ బ్యూరో సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కేరళ శ్రీ కుమార్, రాజస్థాన్ మహేందర్ నేహా, ఆంధ్రప్రదేశ్ కాటం నాగభూషణం, వనం సుధాకర్, పొలిట్ బ్యూరో సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి, బీహార్ చంద్రమోహన్ ప్రసాద్, అనుభవ దాస్ శాస్త్రి, రాజాదాస్, కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed