45 మంది సీఐల బదిలీలు

by Javid Pasha |
45 మంది సీఐల బదిలీలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లాంగ్ స్థాండింగ్ లో ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం సూచించిది. సొంత జిల్లాలకు అధికారులను ట్రాన్స్ఫర్ చెయ్యవద్దని పేర్కొంది. ఈ క్రమంలో పోలీస్ శాఖ బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాన్ క్యాడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను బదిలీ చేసిన పోలీస్ శాఖ తాజాగా 45 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Next Story