ఎలుగుబంటి సంచారం కలకలం.. తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-17 15:15:19.0  )
ఎలుగుబంటి సంచారం కలకలం.. తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు (వీడియో)
X

దిశ, గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండల కేంద్రంలో ఎలుగుబంటి రాత్రి వేళలో తిరుగుతుంది. గత రెండు రోజులుగా అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం సమీపంలో జీల తిరుపతి ఇంటి వద్దకు వచ్చింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అది పరుగులు తీసింది. తరచూ గ్రామంలో తిరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి స్థానికులు కెమెరాల్లో బంధించి సామాజిక మధ్యమాల లో ప్రచారం చేస్తుండడంతో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ప్రజలకు తెలిసింది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చందా నరసింహారావు సూచించారు. అటవీశాఖ అధికారులు ప్రత్యేక చోరువ చూపి ఎలుగుబంటిని పట్టుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story

Most Viewed