CLP మీటింగ్‌ వేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
CLP మీటింగ్‌ వేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ మీటింగ్‌(CLP Meeting) వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగే సీఎల్పీ భేటీకి హాజరుకావొద్దని నిర్ణయించారు. కాగా, సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఇటీవలే ఈ పది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు(Assembly Secretary Narsimhacharyulu) నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియ శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు(భద్రాచలం), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ( శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి( పటాన్ చెరు), కాలె యాదయ్య(చేవెళ్ల), సంజయకుమార్( జగిత్యాల) నోటీసులు అందుకున్నారు.

అయితే వీరంతా సమాధానం ఇచ్చేందుకు గడువు కోరారు. అయితే, పార్టీ ఫిరాయించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండటంతో సీఎల్పీకి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్(Congress) సిద్ధమవుతున్నది. సీఎల్పీలో ఈ ఎన్నికలపై కీలకంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు మంత్రులు సూచనలు చేయనున్నారు. మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు పంచాయతీల్లోనూ విజయం సాధించాలని స్పష్టం చేయనున్నారు.

Next Story