- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటికల్ ఎజెండాలో నలుగుతున్న మీడియా! BRSకి ప్లస్సా.. మైనస్సా?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష రగులుతున్న తరుణంలో ప్రత్యేక ఉద్యమాన్ని గడప గడపకు చేర్చాలనే ఉద్దేశ్యంతో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ పత్రికకు పురుడు పోసింది. 2011 జూన్ 6న ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తోడ్పాటుగా ఈ పత్రికను కేసీఆర్ ప్రారంభించారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్ యాజమాన్య మండలి నుంచి వైదొలిగారు.
అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర పత్రికలు తమ పోరాటాన్ని సరిగా చూపడం లేదనే కారణంగా ఈ పత్రికకు ఆదరణ లభించింది. అయితే ఆనాడు సమైక్య పాలకులు సైతం టీఆర్ఎస్ పార్టీ పత్రిక అయిన నమస్తే తెలంగాణపై ఆంక్షలు పెట్టలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏబీఎన్ ఛానల్‌పై గులాబీ బాస్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తమ ఎమ్మెల్యేలను కించపరిచేలా కథనాలు వచ్చాయంటూ కొన్నేళ్లు ఏబీఎన్ ప్రసారాలు తెలంగాణలో రాకుండా నిలిపివేశారు.
కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ వీ6 ఛానల్, వెలుగు పేపర్‌పై తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, ఏ ఎజెండాతో పనిచేస్తున్నారో.. ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ కేటీఆర్ ఇటీవల ప్రెస్ మీట్‌లో కామెంట్ చేశారు. ఇంతలోనే కేటీఆర్ ఆఫీస్ నుంచి నిన్న ఆ మీడియాపై ఆంక్షలంటూ ఆదేశాలు జారీ కావడం కలకలం రేపింది.
ఇటీవల బీబీసీ మోడీపై ఇండియా ది మోడీ క్వశ్చన్ అంటూ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడం దరిమిలా బీబీసీపై ఐటీ దాడులు సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందిస్తూ ఇది కేవలం బీజేపీ ఉద్ధేశపూర్వకంగా చేయించిన దాడులుగా అభివర్ణించాయి. మంత్రి కేటీఆర్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ బీబీసీ మోడీపై డాక్యుమెంటరీ తీసినందుకే కేంద్రంలోని బీజేపీ దాడులు చేయిస్తోందని ఫైర్ అయ్యారు.
అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని ఛానల్, పేపర్‌పై బ్యాన్ విధించడం ఏంటనే చర్చ సాగుతోంది. బీబీసీపై ఐటీ దాడులను భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు మరి రాష్ట్రంలో మీడియా సంస్థపై బ్యాన్‌ను ఎలా సమర్థించుకుంటారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కపాదం మోపారు.. ఇక మీడియాపై కూడా ఆంక్షలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తెలంగాణలోని జర్నలిస్టు సంఘాలు ఈ ఆంక్షలను ముక్త కంఠంతో ఖండించాయి. ప్రజల గొంతుకగా నిలుస్తోన్న మీడియాపై ఆంక్షలు సరికాదని మేధావులు అంటున్నారు. మరి రానున్న కాలంలో మీడియాపై బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుంది. ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయాలు ఆ పార్టీకి లాభం కన్నా డ్యామెజ్ ఎక్కువ చేస్తాయని తెలిసినా ఇలాంటి దూకుడు నిర్ణయాలకు బీఆర్ఎస్ ఉపక్రమించడం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఆంక్షల ఎఫెక్ట్ బీఆర్ఎస్‌పై ఉంటుందా లేదా అనేది చూడాలి.