- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల బాటిల్ బాంబ్
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు పెట్టిన బాటిల్ బాంబ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూంబింగ్ చేస్తుండగా కనిపించిన ఈ బాంబ్‌ను చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కూంబింగ్ జరిపే పోలీసులను టార్గెట్ చేసి వెంకటాపురం మండలం పామూరు గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో మందు పాతరలు పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్, ములుగు స్పెషల్ పార్టీ ఎస్ఐ తిరుపతి, సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆర్పీఎఫ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ టీంతో కలిసి కూంబింగ్‌కు వెళ్లాయి. ఆ సమయంలో ఎలక్ట్రికల్ వైర్ వారి కంట పడింది.
దాని ఆధారంగా ముందుకు వెళ్లగా బీర్ బాటిల్ ఐఈడీ దొరికింది. వెంటనే బాంబ్ డిస్పోసల్ సిబ్బంది దానిని నిర్వీర్యం చేశారు. బీర్ బాటిల్, బోల్ట్‌లు, రాగి వైర్, ప్లాస్టిక్ లిడ్, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ అగ్రనేతల ఆదేశాల మేరకే ఈ ఐఈడీ బాంబును అమర్చినట్టు సమాచారం ఉందని ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు పుల్లూరి ప్రసాద్ రావు, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, కోయడ సాంబయ్య, కంకణాల రాజి రెడ్డి వెంకన్న, కుర్సు మంగు, ముచకి ఉంగల్ ఎలియాస్ రఘు, కరం బుద్రి ఎలియాస్ రీటా, శ్యామల దులే, కుంజం ఇడుమ ఎలియాస్ మహేందర్ తదితరులపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.