- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో సంచలనం రేపిన అలేఖ్య హత్య కేసు దర్యాప్తు పూర్తి
దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన అలేఖ్య హత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రతిరోజూ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల పర్యవేక్షణలో డి.ఎస్పి గంగారెడ్డి సూచనలతో ఖానాపూర్ ఇన్స్పెక్టర్ సోమవారం సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. గత ఫిబ్రవరిలో ఖానాపూర్ టౌన్ శివాజీ నగర్‌లో అంబేద్కర్ నగర్‌కు చెందిన చెట్‌పల్లి అలేఖ్య అనే యువతిని అదే కాలనీకి చెందిన జుకింది శ్రీకాంత్ అనే వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో అతి దారుణంగా నరికి చంపిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ కేసు దర్యాప్తు వేగవంతం కోసం ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. హత్య చేసి నిందితుడు పారిపోగా కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని పట్టుకున్నారు. కేసులో భాగస్వాములైన ఎవ్వరినీ వదలకుండా ఎటువంటి ఒత్తిడికి తలొగ్గకుండా అందరినీ కొన్ని గంటల వ్యవధిలోనే రిమాండుకు తరలించారు. వెంటనే ఎస్పీ జ్యూడిషరీ సహకారంతో కేసు ఛార్జ్ షీట్‌ను ఓపెన్ చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని కోణాల్లో విచారించి కేసుకు కావలసిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ కేసులో సాక్షులను కూడా ప్రవేశపెట్టారు.ఈ కేసులో దర్యాప్తు అధికారి సీఐ సైదారావు, ఖానాపూర్ ఎస్ఐ లింబాద్రి, ఖానాపూర్ పోలీసు స్టేషన్ సిబ్బందిని ఎస్పి డా.జానకి షర్మిల ప్రశంసించారు.