జ్యూస్ సెంటర్‌లోకి దూసుకువెళ్లిన ఇన్నోవా కారు

by GSrikanth |
జ్యూస్ సెంటర్‌లోకి దూసుకువెళ్లిన ఇన్నోవా కారు
X

దిశ, బడంగ్‌పేట్: ఆటో సడన్‌గా యూటర్న్​ తీసుకోవడంతో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి జ్యూస్ సెంటర్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్​స్టేషన్​పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌ సమీపంలోని కర్మాన్​ఘాట్‌కు చెందిన శ్రీకాంత్​రెడ్డి అనే వ్యక్తి తన డ్రైవర్‌తో కలిసి ఇన్నోవా కారులో బంధువులను పికప్​చేసుకోవడానికి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్‌సీఐ మెయిన్​రోడ్ సాయినగర్​వద్ద ఓ ప్యాసింజర్​ఆటో సడన్‌గా యూటర్న్ చేసుకోవడంతో ఇన్నోవా కారు అదుపుతప్పి రాయల్​గ్రూప్​ఆఫ్ జ్యూస్ సెంటర్‌లోకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇన్నోవా డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇన్నోవా ధ్వంసమయ్యింది.

Advertisement

Next Story