- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనపై గవర్నర్ సీరియస్.. 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీనేజ్ బాలికపై జరిగిన సామూహిత్య అత్యాచార ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాచకొండ పోలీసు కమిషనర్, మీర్‌పేట్ ఏసీపీ తదితరులను గవర్నర్ ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకున్న గవర్నర్.. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఈ సంఘటనకు సంబంధించి సమగ్రమైన వివరాలతో పాటు పోలీసు శాఖ నుంచి తీసుకున్న చర్యలు, నిందితుల అరెస్టు తదితరాలన్నింటినీ నివేదికలో పొందుపర్చి 48 గంటల్లోగా అందజేయాలని గవర్నర్ ఆదేశించినట్లు ఆ ప్రకటన పేర్కొన్నది. బాధితులకు అండగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలను అందించాల్సిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బాధ్యులను ఆదేశించినట్లు తెలిపింది.
Advertisement
Next Story