School Holiday:విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

by Jakkula Mamatha |   ( Updated:2024-07-30 04:17:50.0  )
School Holiday:విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్:విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేపు (సోమవారం) బోనాలు పండుగ సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆదివారం, సోమవారం రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్‌ సెలవుగా ప్రకటించింది.

సోమవారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు ఈ సెలవు వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపు (జులై 29) మూతపడనున్నాయి. నేడు(ఆదివారం) పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు, రేపు పబ్లిక్ హాలిడే నేపథ్యంలో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.

Read More : స్కూళ్లకు దసరా, సంక్రాంతి హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం

Next Story
null