తెలంగాణలో దొంగలు నిర్మించిన తొలి గుడి.. పిలిస్తే పలికే దేవుడిగా గుర్తింపు!

by GSrikanth |
తెలంగాణలో దొంగలు నిర్మించిన తొలి గుడి.. పిలిస్తే పలికే దేవుడిగా గుర్తింపు!
X

భోగ మల్లన్న ఐలోని, వేలాల కత్రశాల గట్టుమల్లన్న పేరు విన్నాం. పేదలపెన్నిధి కోమురవెల్లి మల్లన్నను కొలిచాం. సామాన్యుల ఆదిదేవుడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నాం. కానీ దొంగ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా..? దొంగకు గుడి ఏంటి. పూజలేంటి అనుకుంటున్నారా..? అవును దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన జగిత్యాల జిల్లాలోనే ఉంది. పిలిస్తే పలికే దేవుడిగా కీర్తి గడించిన వారు దొంగ మల్లన్న. జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండలంలో ఉన్న గ్రామం మల్లన్నపేట. ప్రతి ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు మల్లన్నపేటలో ప్రతిరోజు పండగే. ఎంతో ప్రసిద్ధి చెందిన దొంగ మల్లన్న స్వామి గుడి ఉన్నది ఇక్కడే. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మించబడిన ఆలయం ఇది. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నను దొంగ మల్లన్న స్వామిగా భక్తులు ఆరాధిస్తుంటారు. దొంగ మల్లన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.

దిశ, వెల్గటూర్: భోగ మల్లన్న ఐలోని, వేలాల కత్రశాల గట్టుమల్లన్న పేరు విన్నాం. పేదలపెన్నిధి కోమురవెల్లి మల్లన్నను కొలిచాం. సామాన్యుల అదిదేవుడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నాం. కానీ దొంగ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా..? దొంగకు గుడి ఏంటి. పూజలేంటి అనుకుంటున్నారా..? అవును దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన జగిత్యాల జిల్లాలోనే ఉంది. పిలిస్తే పలికే దేవుడిగా కీర్తి గడించిన వారు దొంగ మల్లన్న. ఇంతకీ దొంగకీ.. గుడికీ సంబంధమేంటో తెలుసుకుందాం. దొంగ మల్లన్న జాతరకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్ధం చేశారు.

దొంగలు కట్టిన గుడి దొంగమల్లన్న :

జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండలంలో ఉన్న గ్రామం మల్లన్నపేట. ప్రతి ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు మల్లన్నపేటలో ప్రతిరోజు పండగే. ఎంతో ప్రసిద్ధి చెందిన దొంగ మల్లన్న స్వామి గుడి ఉన్నది ఇక్కడే. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మించబడిన ఆలయం ఇది. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నను దొంగ మల్లన్న స్వామిగా భక్తులు ఆరాధిస్తుంటారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్టి మొదలుకొని ఏడు వారాలపాటు బోనాల జాతర జరుగుతుంది. డిసెంబర్‌ నెలంతా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. జగిత్యాల జిల్లాలో జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, బుధవారాల్లో భక్తులు వేకువ జామునే లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతో స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి వారికీ దండి వారం ఎంతో ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. గొల్లకురుమల డోలు దెబ్బలు శివసత్తుల పునకాలతో 7 వారాలు ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుంది. ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుంచి భక్తులు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దొంగలు కట్టిన గుడిలో దొంగ మల్లన్న ఎంతో ప్రసిద్ధి పొందారు.

పట్నాలు మల్లన్నకు ప్రీతీ పాత్రం :

మల్లన్న స్వామి జాతరకు వచ్చే భక్తులు పసుపు బండారుతో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 17న రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం, 18న సోమవారం దండివారం 19న మంగళవారం నాగవల్లి, పెద్దపట్నం, అగ్నిగుండాలు, ఈ నెల 20 నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జాతర నిర్వహిస్తారు. చివరి రోజు జనవరి 11న గురువారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీహోమం, పూర్ణాహుతితో దొంగ మల్లన్న జాతర ఉత్సవాలు ముగిస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తులు స్వామి వారిని ఇష్ట దైవంగా పూజిస్తుంటారు. ఎంతో నిష్టగా మల్లన్న స్వామిని ఆరాధిస్తారు.

దొంగలు కట్టిన గుడి :

మల్లన్నస్వామి ఆలయాన్ని 11వ శతాబ్దపు చివరి భాగంలో పోలాస పాలకులు నిర్మించారని ఓ వాదన ఉండగా.. కాకతీయుల కాలంలోనే నిర్మాణం జరిగినట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది. 15, 16వ శతాబ్ధంలో వెలమ దొరలు, తంబీరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. అయితే ఈ స్వామికి దొంగ మల్లన్న అనే పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. కొన్నేళ్ల కింద పోలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులు చోరీకి గురయ్యాయట. ఈ విషయం రాజుకు తెలియడంతో దొరికిపోతామని భావించిన దొంగలు.. మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దీంతో కోటలోంచి తెచ్చిన ఆవులు రంగు మారిపోయాయట. తమ కోరిక తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారని, అందుకే ఈ ఆలయానికి దొంగమల్లన్న స్వామి పేరు వచ్చిందని చెబుతుంటారు మల్లన్నపేట గ్రామస్తులు.

Advertisement

Next Story

Most Viewed