‘గృహజ్యోతి’ అమలుపై సర్కార్ ఫోకస్.. ఆధార్ కార్డు లేకపోతే చేయాల్సింది ఇదే!

by GSrikanth |
‘గృహజ్యోతి’ అమలుపై సర్కార్ ఫోకస్.. ఆధార్ కార్డు లేకపోతే చేయాల్సింది ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా గృహజ్యోతి స్కీమ్ పై కాంగ్రెస్ సర్కారు కసరత్తు చేస్తున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ శాఖ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ఈ స్కీమ్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి అంటూ శుక్రవారం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ లేని వారు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఈ స్కీమ్ ను వర్తింపజేయాలని విద్యుత్ శాఖకు రిక్వెస్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్నా.. ఆధార్ కార్డు రాకపోతే సదరు వ్యక్తి ఎన్ రోల్ మెంట్ నంబర్ ఇవ్వాలని, కార్డు వచ్చాక పూర్తి వివరాలు అందిస్తానని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు.

దీంతోపాటు బ్యాంక్ పాస్ బుక్ లేదా పాన్ కార్డు, లేదా పాస్ పోర్ట్ లేదా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, కిసాన్ ఫొటో పాస్ బుక్, ఉపాధి హామీ పథకం కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, తహశీల్దార్ అప్రూవ్ చేసిన సర్టిఫికెట్లలో ఏదో ఒకటి అందించాలని పేర్కొన్నారు. శాఖ ద్వారా బయోమెట్రిక్ లింక్ చేసే సమయంలో వినియోగదారుల ఫింగర్ ప్రింట్ సరిగ్గా నమోదు కాకుంటే.. అందుకు ఏజెన్సీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఐ రికగ్నైజేషన్ ద్వారా, లేక ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్క విధానం సక్సెస్ అవ్వకుంటే ఆధార్ కార్డు నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ ద్వారా చేపట్టాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ స్పష్టంచేశారు. అలా కూడా సాధ్యం కాని సమయంలో ఆధార్ కార్డు ఫిజికల్ కాపీపై ఉన్న క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా బయోమెట్రిక్ లింక్ చేయాల్సి ఉంటుదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story