Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు!

by D.Reddy |   ( Updated:2025-04-20 11:36:56.0  )
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు సీరియస్​గా చేసే సిల్లీ పని ఏంటంటే ఇన్​స్టాగ్రామ్​లో (Instagram) రీల్స్ చూడడం. అంతేకాదు, కొంతమంది అయితే చూసిన ప్రతి రీల్‌ను తమ స్నేహితులకు షేర్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌లో ఒకే రకమైన రీల్స్‌ను ఇష్టమైన ఫ్రెండ్స్, గ్రూప్​తో కలిసి చూసే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్​ ద్వారా వినియోగదారులు తమ ఫ్రెండ్స్​తో ప్రైవేట్, కస్టమైజ్డ్ రీల్స్​ ఫీడ్​ను షేర్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు చూస్తున్న రీల్స్, మీ ఫ్రెండ్‌లు చూస్తున్న రీల్స్ అన్నీ కలిసిపోయి ఒక 'షేర్డ్ కస్టమ్ రీల్స్ ఫీడ్'గా తయారవుతుంది. అంటే మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా రీల్స్ లిస్టు రెడీ అవుతుందన్నమాట. రోజు రోజుకు అది అప్డేట్ అవుతుంది. దీంతో మీరు బ్లెండ్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ కొత్త కొత్త రీల్స్ చూడొచ్చు. ఇది మీకు నచ్చిన స్నేహితులు లేదా ఫ్రెండ్స్‌ గ్రూప్‌తో కలిసి ఉపయోగించుకోవచ్చు.

ఈ ఫీచర్​ను ఉపయోగించడం ఎలా?

* మీ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక DM చాట్‌ను ఓపెన్ చేయాలి.

* పైన ఉన్న 'బ్లెండ్' ఐకాన్​పై క్లిక్ చేయాలి.

* తర్వాత ఇన్వైట్ అనే ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్​కు ఇన్విటేషన్​ పంపించాలి.

* ఒకసారి వారు మీ ఇన్విటేషన్​ను అంగీకరిస్తే బ్లెండ్ షేర్డ్ ఫీడ్ యాక్టివ్ అవుతుంది.

* ఇద్దరు యూజర్లూ బ్లెండ్​లో జాయిన్ అయిన వెంటనే DM ద్వారా షేర్​ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్​ ఫీడ్​లో ఆటోమేటిక్​గా అప్డేట్ అవుతుంది.

* అంతే ఇక ఆ చాట్‌లో ఉన్నవారంతా ఆ బ్లెండ్ రీల్స్ ఫీడ్‌ను ఎప్పుడైనా తిరిగి చూసుకోవచ్చు.

* బ్లెండ్‌లోని ప్రతి రీల్‌తో పాటు అది ఎవరికి కనిపించాలో వారి పేరు కూడా ఉంటుంది.

* వినియోగదారులు రీల్స్ చూస్తున్నప్పుడు దిగువన ఉన్న మెసేజ్ బార్ నుంచి చాట్ చేయొచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రెస్పాండ్ అవ్వొచ్చు.

Click For Tweet Post..



Next Story

Most Viewed