నిన్ను మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అంటూ ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు.. స్ట్రాంగ్‌గా ఉండండి అని నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
నిన్ను మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అంటూ ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు.. స్ట్రాంగ్‌గా ఉండండి అని నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్‌లో ఎస్ఎస్‌ఎమ్‌బీ-29(SSMB 29) సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా మెయిన్ రోల్‌లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి(Indira Devi)ని గుర్తు చేసుకున్నారు.

తన మాతృమూర్తి జయంతి(Birthday) సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మ.. నిన్ను మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను’ అంటూ ఆమెతో దిగిన ఫొటో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మహేష్ బాబు ఇంట్లో 2022లో వరుసగా విషాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అన్న రమేష్ బాబు, నాన్న కృష్ణ, తల్లి ఇందిరమ్మ ఇలా అందరూ వరుసగా మరణించడంతో మహేష్ బాబు మరింత కుంగిపోయాడు.



Next Story

Most Viewed