ముగిసిన ఈసెట్.. మొత్తం ఎంతమంది రాశారంటే!

by GSrikanth |
ముగిసిన ఈసెట్.. మొత్తం ఎంతమంది రాశారంటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్-23) ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు మొత్తం 96.53 శాతం మంది విద్యార్థులు హారయ్యారని శనివారం ఈసెట్ కన్వీనర్ శ్రీరామ్ వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సెట్ ఎగ్జామ్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహినట్లు వెల్లడించారు. తెలంగాణలోని కేంద్రాల్లో 20,517 మంది, ఆంధ్రప్రదేశ్ సెంటర్లలో 1937 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రకటించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి సారథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు. పూర్తిగా అన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించామని తెలిపారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌, బీఎస్‌సీ మ్యాథ్స్‌ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా బీటెక్‌, బీఫార్మసీలో చేరేందుకు ఏటా ఈసెట్‌ను నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed