- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికొద్దిసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్న సీఎం.. కొండగట్టు దారులన్ని క్లోజ్!
దిశ, మల్యాల, కొడిమ్యాల: కొండగట్టు అంజన్న ఆలయానికి వెల్లే దారులన్ని మూసివేశారు. సామాన్యులు, మీడియా ఎవరూ కూడా అంజన్న సన్నిధికి చేరుకోకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కొద్దిసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా అధికారులు ఎక్కడికక్కడ దారులన్ని క్లోజ్ చేసేశారు.
జగిత్యాల రహదారి మీదుగా వెల్లే ఘాటు రోడ్డును పూర్తిగా క్లోజ్ చేసిన అధికారులు అక్కడ ప్రత్యేకంగా బారిగేడ్లు పెట్టి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే నాచుపల్లి మీదుగా కొండగట్టుకు వెల్లే రోడ్డు మీదుగా సీఎంఓ అదికారులు, సీఎం సెక్యూరిటీతో పాటు జిల్లా అధికారులు మాత్రమే వెల్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసే వరకు ఈ కట్టడి చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా అధికారులు చెప్తున్నారు.
మీడియాకు నో ఎంట్రీ
మరోవైపున సీఎం టూర్ కవరేజ్ కోసం పాసులు కూడా ఇచ్చిన జిల్లా అధికారులు మీడియాను కొండగట్టు వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారు. జగిత్యాల రోడ్డులోని ఓ హటల్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తూ సీఎం పర్యటన ప్రోగ్రాంను కవర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. లైవ్ టెలికాస్ట్ చూసేందుకు మాత్రమే జిల్లా అధికారులు పాస్ లు ఇవ్వడం, అది అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికేనన్న షరతు విధించడం గమనార్హం.