- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడు అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. పాతబస్తి బార్కస్ కు చెందిన మహ్మద్ వసీం పదేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తనకు చాలా కాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇలాంటి బెదిరింపులకు గురి కావడం మొదటి సారేమి కాదని వీటిపై గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదు చేసినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, వీటిపై పోలీసులు స్పందించాలని కోరారు. తన భద్రత విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యంపై నిరసనగా తనను బెదిరింపులకు పాల్పడుతున్న వారికి సీఎం రేవంత్ ఫోన్ నెంబర్ ఇచ్చాని చెప్పారు. దీంతో ఈ పరిణామం తీవ్ర దుమారంగా మారింది. ఇంతలో నిందితుడిని అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.