ఆ టెక్నాలజీ రాజీవ్ గాంధీ తెచ్చిందే.. జగ్గారెడ్డి ‘కీ’ కామెంట్స్

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-24 15:41:15.0  )
ఆ టెక్నాలజీ రాజీవ్ గాంధీ తెచ్చిందే.. జగ్గారెడ్డి ‘కీ’ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తెచ్చిందేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..మోడీకి టూర్లు తప్పా,టెక్నాలజీ తెలియదన్నారు. హైటెక్ సిటీకి పునాది వేసింది కూడా రాజీవ్ ఆలోచననే అన్నారు. కానీ చాలా మంది తాము హైటెక్ సిటీని కట్టామని డబ్బాలు కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. టెలీ కమ్యూనికేషన్స్ ని ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీదన్నారు.

జైల్లో ఉన్న బిడ్డతో కేసీఆర్ మాట్లాడుతున్నది కూడా రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తోనే అని ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీకి పునాది రాజీవ్ ఆలోచనలే అన్నారు.70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించే కేటీఆర్, హరీష్​ తో పాటు బీజేపీ నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని లాగా కాకుండా ఓ ఎంప్లాయి లాగా పనిచేశారన్నారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఓటు ద్వారా ఎన్నికల వ్యవస్థ నెహ్రు తీసుకురాగా,18 ఏండ్లు నిండిన యువత కి ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed