- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TGSRTC: సంక్రాంతి స్పెషల్ బస్సుల టికెట్ ధరలపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇదే!

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో 6432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (TGSRTC) టీజీఎస్ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే (special buses) స్పెషల్ బస్సుల్లో (ticket prices) టికెట్ ధరలు విపరీతంగా పెంచారని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీజీఎస్ఆర్టీసీ తాజాగా ఓ ప్రకటనలో టికెట్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించినట్లు ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.