TG : ఓడినా.. పదవిలోనే ఆ ఇద్దరు ముఖ్య నేతలు

by Rajesh |
TG : ఓడినా.. పదవిలోనే ఆ ఇద్దరు ముఖ్య నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. కాగా, ఈ సారి తెలంగాణలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీలో నిలిచారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు హస్తం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. ఇదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ఎంపీగా బరిలో ఉన్నారు. అయితే వీరి గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవేళ వీరు ఓడినా ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed