- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నుంచి ఆ 10 మంది రావట్లే.. రూటు మార్చిన కాంగ్రెస్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని గతంలో ప్రచారం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మరో విధమైన వాదన వినిపిస్తున్నది. ఆ ఎమ్మెల్యేలంతా మద్దతు మాత్రమే ఇస్తున్నారని ఇటీవల పీసీసీ చీఫ్ గాంధీభవన్ లో కామెంట్ చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రయత్నించగా, కొందరు గులాబీ ఎమ్మెల్యేలు ఓ టీమ్ గా ఏర్పడి, కాంగ్రెస్ కు మద్ధతు ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని జగిత్యాల, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో అసలు ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. గతంలో ఈ ఎమ్మెల్యేలంతా సీఎంను కలిశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వారికి కండువాలు కప్పారు. కానీ అవి పార్టీ కండువాలు కాదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ముందస్తు జాగ్రత్తతో కాంగ్రెస్ వేసిన ప్లాన్ లో బీఆర్ఎస్ ఇరుక్కున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మిగతా వాళ్ల పరిస్థితి ఏమిటీ?
భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు తమ పార్టీ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారని బీఆర్ ఎస్ కోర్టుకు వెళ్లింది. ఇందులో దానం నాగేందర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారని పేర్కొన్నది. ఇది కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో అప్రమత్తమై.. టెక్నికల్ సమస్యలు లేకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడిందని పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్లతో రాజీనామా చేయించకపోవడమే కాకుండా, మూడు రంగులతో కూడిన కండువాలు మాత్రమే కప్పామని పార్టీ నేతలు వివరిస్తున్నారు. అయితే త్వరలో మరి కొన్ని జాయినింగ్స్ ఉంటాయని, కేటీఆర్ సన్నిహితులు కూడా తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ చెప్పారు. ఇదే నిజమైతే, ఆ వచ్చే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కాండువాలు కప్పుతారా? దేవుడి కండువాలతో ఆహ్వానిస్తారా? అని ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది.
టార్గెట్ 25!
బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవాలని భావించిన కాంగ్రెస్, ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేల మద్దతు పొందింది. మరో 15 మంది విడతల వారీగా మద్దతు ఇచ్చేలా పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఆ తర్వాత లీగల్ చిక్కులు లేకుండా సమస్యలన్నీ సద్దుమణిగిన తర్వాత అందరికీ ఒకే సారి పార్టీ కండువాలు వేసే అవకాశం ఉన్నదని పీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. అయితే గతంలో వెళ్లిన ఎమ్మెల్యేలకే తామే పార్టీలో ఉన్నామనే విషయం పై క్లారిటీ లేని నేపథ్యంలో, ఇప్పుడు కొత్తగా జాయినింగ్స్ ఉంటాయా? అనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే జరుగుతున్నది.