వినాయక నిమజ్జనం వేళ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 600 స్పెష‌ల్ బ‌స్సులు

by Mahesh |   ( Updated:2024-09-16 12:23:22.0  )
వినాయక నిమజ్జనం వేళ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 600 స్పెష‌ల్ బ‌స్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 17న హైదరాబాద్ మహానగరం వినాయకుడి శోభాయత్రలో మార్మోగనుంది. దాదాపు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ శోభాయాత్రలకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వినాయక నిమజ్జనం వేళ నగర ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 17న శోభయాత్రల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. తెలంగాణ ఆర్టీసీ(TGSRTC ) ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఆయన ట్వీట్‌లో "గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఈ నెల 17న గ‌ణేష్ నిమ‌జ్జనోత్సవం, శోభ‌యాత్ర సంద‌ర్భంగా భ‌క్తుల రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆర్టీసీ యాజ‌మాన్యం ప్రత్యేక చ‌ర్యలు తీసుకుంటోంది. వినాయ‌క నిమ‌జ్జన వేళ ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాలను కలుపుతూ.. దాదాపు 600 స్పెష‌ల్ బ‌స్సుల‌ను సంస్థ న‌డుపుతోంది. GHMC ప‌రిధిలోని ఒక్కో డిపో నుంచి 30 నుంచి 15 బస్సుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని గ‌ణేష్ నిమ‌జ్జనోత్సవంలో పాల్గొనాల‌ని భ‌క్తుల‌కు ఆర్టీసీ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది" అని సజ్జనార్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే ఏ ఏ డిపో నుంచి ఎన్ని బస్సులు ఏ ఏ రూట్లలో నడవనున్నయో కూడా లిస్ట్ విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed