TG High Court: పట్నం నరేందర్ రెడ్డికి బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

by Shiva |   ( Updated:2024-12-04 06:24:31.0  )
TG High Court: పట్నం నరేందర్ రెడ్డికి బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్ (Kodangal) మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు (Kodangal Court) రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టు (High Court)లో ఇటీవలే క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, 10 రోజుల క్రితమే పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ (K.Laxman) ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి (Narender Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. కాగా.. లగచర్ల (Lagacharla)లో ఫార్మాసిటీ (Pharma City) భూసేకరణకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ (Collector Prateek Jain) అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు (Palle Nageshwar Rao) కోర్టుకు తెలిపారు. ఏ2గా ఉన్న భోగమోని సురేష్ (Bhogamoni Suresh), ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని వెల్లడించారు. సురేష్‌తో దాదాపు 89 సార్లు నరేందర్ రెడ్డి (Narender Reddy) ఫోన్‌లో మాట్లాడారని ధర్మాసనానికి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్‌ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టు విన్నవించారు. దాడికి కుట్రలో నరేందర్ ‌రెడ్డి (Narender Reddy) పాత్ర స్పష్టంగా ఉందని.. అవన్ని దర్యాప్తులో బయడపడతాయని, అప్పటి వరకు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. తాజాగా, ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ (Quash Petition)ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed