- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Govt.: హస్తకళలు, చేనేతలకు సర్కార్ ప్రోత్సాహం.. రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 5న తొలుత శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ప్రారంభించనున్నది. గత ప్రభుత్వం మాదాపూర్‌లోని శిల్పారామంలో ఉన్న స్టాల్స్‌పై నిర్లక్ష్యం వహించింది. సుమారు ఏడేళ్లుగా అవి నిరూపయోగంగానే ఉన్నాయి. వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.9 కోట్లు కేటాయించి స్టాళ్లపునరుద్ధరణ పనులు చేపట్టింది. మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు రైతు బజార్ తరహాలో వీటిని సిద్ధం చేశారు. ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ గా నామకరణం చేశారు. దానికి మరో పేరు ‘నైట్ బజార్’ అని కూడా పిలవనున్నారు. వాటిని ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5వ తేదీన మంత్రి సీతక్క మహిళా సంఘాలకు కేటాయించిన స్టాళ్లను ప్రారంభించనున్నారు. ఇక్కడ దాదాపు 106 స్టాల్స్ఉన్నాయి. ఐటీ హబ్ కు సమీపంలో ఉండటంతో సేల్స్ సైతం పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
చేనేత, హస్తకళలు, కళంకారి వస్తువులు
ఈ స్టాళ్లలో చేనేత, హస్తకళలు, గృహానికి సంబంధించిన వస్తువులు, అలంకరణ పరికరాలు, కళంకారి, జ్యూవెలరీ, క్లాత్స్, ఇతర వస్తువులతో పాటు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకే ఇవి కేటాయించారు. గ్రామీణ ఉత్పత్తి దారులను పట్టణ, అంతర్జాతీయ వినియోగదారులతో అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు వారి స్వయం ఉపాధికి బాటలు వేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. విభిన్నమైన వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు సరసమైన ధరలకు లభించేలా ఉంచనున్నారు.
మహిళల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే మహిళా సంఘాల సభ్యులకు చీరలు సైతం ఉచితంగా అందజేయనున్నాం. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. రుణసదుపాయాన్ని పెంచాం. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళలకు ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది. మరోవైపు హస్తకళలు, చేనేతలకు ప్రోత్సాహించేలా చర్యలు చేపడుతున్నాం. శక్తి బజార్‌లో వాటి విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.