TG Budget 2024-25: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా నిధుల కేటాయింపు ఇలా..

by Shiva |   ( Updated:2024-07-25 07:23:45.0  )
TG Budget 2024-25: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా నిధుల కేటాయింపు ఇలా..
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో వివిధ రంగాలకు శాఖల వారీగా నిధులను కేటాయించారు. అందులో వ్యవసాయశాఖకు రూ.72,659 కోట్లు, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు, సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు, ఉద్యానవనం రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు, ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు, జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతులకు రూ.3065 కోట్లు, హెచ్ఎండీఏలో మౌలిక వసతులకు రూ.500 కోట్లుగా కేటాయించారు.

అదేవిధంగా రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు,హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయించారు. విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజా పంపిణీకి రూ.3,836 కోట్లు, గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు, రీజినల్ రింగ్‌ రోడ్డుకు రూ.1525 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

Advertisement

Next Story