TG Assembly: ‘మహాలక్ష్మి’ పథకం ఓ గేమ్ ఛేంజర్.. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణు‌దేవ్ వర్మ

by Shiva |   ( Updated:2025-03-12 07:48:28.0  )
TG Assembly: ‘మహాలక్ష్మి’ పథకం ఓ గేమ్ ఛేంజర్.. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణు‌దేవ్ వర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యయమని తెలిపారు. ఇప్పటి వరకు అన్నదాతలకు రూ.25 వేల కోట్ల రుణమాపీ చేశామని అన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు.

దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతోందని, వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఇప్పటి వరకు రూ.1,206 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయణించేందుకు వెసులుబాటు కల్పించామని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యవతలో నైపుణ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. పేదకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదలను అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. TGPSCని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామని.. కొత్తగా 163 సేవలను కూడా అరోగ్యశ్రీ పరిధిలోని తీసుకొచ్చామని అన్నారు. బీసీలకు 42 శతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామని పేర్కొన్నారు. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించామని అన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12వేల సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తున్నామని అన్నారు. నీటి వాటా కోసం కృష్ణా ట్రిబ్యుూనల్ ముందు వాదనలు వినిపించామని, భావి తరాలకు నీటి వనరులను భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ఓ గేమ్ ఛేంజర్ అంటూ అభివర్ణించారు. ఉచిత బస్సు పథకానికి రూ.5,005 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తే చేశామని, ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.1.78 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఆ పెట్టుబడుల ద్వారా 49,500 మందికి ఉపాధి లభించనుందని అన్నారు.

Read More..

KCR: అసెంబ్లీకి బయలుదేరిన గులాబీ బాస్.. పార్టీ శ్రేణుల్లో కోలాహలం

Next Story

Most Viewed