- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
TG Assembly : అసెంబ్లీ సెషన్ స్టార్ట్.. కౌరవులు అంటూ కాంగ్రెస్ సభ్యులపై హరీష్ రావు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనుండగా చివరి రోజు సభ ప్రారంభంలోనే దద్దరిల్లింది. స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా మాట్లాడకుండా తొలుగ బీఆర్ఎస్ నిరసన తెలిపింది. వర్గీకరణ మినహా మరే ఇతర అంశం మాట్లాడినా.. మైక్ కట్ చేస్తామని బీఆర్ఎస్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చిచెప్పారు. కాగా, సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశం అని.. వర్గీకరణపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం సహకరించాలని కోరారు. సభలోకి కేసీఆర్ కూడా వచ్చి చర్చలో పాల్గొనాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది కౌరవుల సభలా ఉందని.. అంతిమంగా పాండవులదే విజయం అన్నారు. వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 2014లోనే నాటి సీఎం కేసీఆర్ సభలో తీర్మానం చేసి పంపారని గుర్తు చేశారు. తీర్మానం కాపీని స్వయంగా ప్రధానికి కేసీఆర్ ఇచ్చారన్నారు.