TG Assembly : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం.. అసెంబ్లీలో మంత్రి పొన్నం Vs KTR

by Sathputhe Rajesh |
TG Assembly : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం.. అసెంబ్లీలో మంత్రి పొన్నం Vs KTR
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై కేటీఆర్ వర్సెస్ మంత్రి పొన్నంల మధ్య మాటల యుద్ధం నడిచింది. తొలుత కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏంటో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదన్నారు. సభలో తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదన్నారు. అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోందన్నారు. ప్రధాని, సీఎంల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేలా వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు.

దీనికి మంత్రి పొన్నం రిప్లై ఇస్తూ.. రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి పొన్నం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని సీరియస్ అయ్యారు. సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story