ఉగ్ర కుట్ర కేసు : రంగంలోకి ఎన్ఐఏ!

by Sathputhe Rajesh |
ఉగ్ర కుట్ర కేసు : రంగంలోకి ఎన్ఐఏ!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నేపథ్యంలో కేసు విచారణను చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర నిఘా సంస్థలు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు మొదట భోపాల్ లో 11 మందిని అరెస్ట్ చేసారు. ప్రధాన సూత్రధారి యాసిన్ ను జరిపిన విచారణలో హైదరాబాద్ లో కూడా తమవాళ్లు ఉన్నట్టు వెల్లడించాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నుంచి ఆరుగురిని అరెస్ట్ చేసారు.

విచారణలో భోపాల్, హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వారంతా హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థకు చెందిన వారని వెళ్లడయ్యింది. వీళ్లు వికారాబాద్ అడవుల్లో ఎయిర్ పిస్టోళ్ళు, ఎయిర్ గన్లతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్టు తెలిసింది. దాంతోపాటు ఆన్ లైన్లో ఆత్మాహుతి దాడులు, గ్రనేడ్, కెమికల్ అటాక్స్ పై అవగాహన పెంచుకున్నట్టు వెళ్లడయ్యింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించాలని కుట్రలు చేసినట్టు తేలింది. ఒక్క భోపాల్, హైదరాబాద్ కాకుండా ఈ నెట్వర్క్ దేశంలోని మరిన్ని పట్టణాల్లో విస్తరించి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. కేసు తీవ్రత, విస్తృతి నేపథ్యంలోనే ఎన్ఐఏ ఇందులో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed