ఉట్నూర్‌లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ

by Mahesh |   ( Updated:2024-09-15 10:49:21.0  )
ఉట్నూర్‌లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌( Utnoor)లో తీవ్ర ఉద్రిక్తత(Tension) నెలకొంది. ఇటీవల జైనూర్(Zaynur) ప్రాంతంలోని ఆదివాసి మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. అనంతరం ఆమెపై దాడి చేసి.. ఊరికి దూరంగా తీసుకెళ్లి ఆటో నుంచి కిందకి తోసేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ కోలుకొని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎంపీ నగేష్ వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు, బీజేపీ(BJP) కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ తో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed