Seethakka : సీతక్క ఆదేశాలతో అధికారుల్లో టెన్షన్ !

by Y. Venkata Narasimha Reddy |
Seethakka : సీతక్క ఆదేశాలతో అధికారుల్లో టెన్షన్ !
X

దిశ, వెబ్ డెస్క్ : పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం(Construction of CC Roads)లో నాణ్యత కొరవడటం(Lack of quality) పట్ల ఆ శాఖ మంత్రి సీతక్క(Seethakka)మండిపడ్డారు. గ్రామీణ రహదారి పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్సీ కనక రత్నంలతో పనులను సమీక్షించిన సీతక్క కొన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న వార్త కథనాలను ప్రస్తావించారు.

నాసిరకం పనుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క అటువంటి పనులకు క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మండిపడ్డారు. నాసిరకం పనులు జరిగిన చోట బిల్లులు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. తక్షణం ఆయా ప్రాంతాలకు క్వాలిటీ కంట్రోల్ టీములను పంపాలని ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యత పై రాజీ పడేది లేదని, నాణ్యత లోపాలపై నివేదికలు తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, ఏ స్థాయిలో ఉన్న వదిలే ప్రసక్తి లేదన్నారు.

నాసికం పనులు చేసిన చోట సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. మంత్రి ఆదేశాలతో పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన క్వాలిటీ కంట్రోల్ టీంలు రోడ్ల నిర్మాణ పనుల నాణ్యత పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయోనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

Next Story

Most Viewed