- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖైరతాబాద్‌లో వద్ద ఉద్రిక్తత.. MLA రాజాసింగ్ అనుచరులు అరెస్ట్

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేషుడి విగ్రహం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భక్తులకు ఏంజరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. పోలీసులు అప్రమత్తమై నిరసన కారులను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ నిరసన కారులు శాంతించ లేదు. దీంతో కొద్ది సేపు పోలీసులు మరియు కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. నిరసన కారులను అరెస్టు చేసి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తలించారు. దీంతో అక్కడ సాధరణ పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story