- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పరీక్షకు వెళ్తున్న విద్యార్థుల అడ్డగింత.. రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరీక్ష రాయకుండా ఆందోళన కారులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్టూడెంట్స్ ప్రొఫెసర్లను బయటకు పంపించి వేసి విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. జీవో నెంబర్ 55ను రద్దు చేసేవరకు పరీక్షలు రాయబోమని తెగేసి చెప్పారు.
యూనివర్సిటీ భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాగా, ఇటీవల యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. మహిళా ఏబీవీపీ కార్యదర్శి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై పార్టీలకతీకంగా స్పందించి ఖండించారు. తాజాగా.. మరోసారి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైంది.