విదేశీ పెట్టుబడులతో పది లక్షల ఉద్యోగాలు : టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్

by M.Rajitha |
విదేశీ పెట్టుబడులతో పది లక్షల ఉద్యోగాలు : టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్
X

దిశ; తెలంగాణ బ్యూరో : విదేశీ పెట్టుబడులతో పది లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ ఉన్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు రావడం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఫ్యూచర్ తెలంగాణ పేరిట తమ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే దిశగా చొరవ చూపుతుందన్నారు. మరోవైపు సీఎం స్పెషల్ ఫోకస్ తో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారని, దీని వలన రాష్ట్రంలోని యువతలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. సీఎం అమెరికా పర్యటనతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ 42 వేల ఉద్యోగాలను తీసుకు వస్తానని హామీ ఇచ్చారని, కానీ కనీసం నలుగురికి కూడా తీసుకురాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బిడ్డల ఆకలి విలువ తెలుసునని, అందుకే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. సీఎం యూఎస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతల బలుపు మాటలు బంద్ చేయాలని, లేదంటే తగిన స్థాయిలో బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Next Story

Most Viewed