నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా టీడీపీ 41 వసంతాల సెలబ్రేషన్స్

by Nagaya |   ( Updated:2023-03-29 11:22:57.0  )
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా టీడీపీ 41 వసంతాల సెలబ్రేషన్స్
X

దిశ, కార్వాన్: తెలుగు దేశం పార్టీ స్థాపించి 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సభలో నందమూరి తారక రామ రావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, అచ్చెంనాయుడు, కాసాని జ్ఞానేశ్వర్, భారీ కటౌట్లతో, ఫ్లెక్సీలతో ఏర్పాట్లు జరిగాయి. తెలుగు రాష్ట్రాల టీడీపీ ప్రజాప్రతినిదులు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. అయితే నందమూరి తారక రామారావు అధికారంలోకి రావడానికి ముందు వాడిన చైతన్య రథం వాహనము ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అప్పట్లో ఈ చైతన్య రథంపై లక్ష కిలోమీటర్ల సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించి 9 నెలలకే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: తెలుగుదేశం ఏర్పాటు... నవ చరిత్రకు మలుపు













Advertisement

Next Story

Most Viewed