- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ నెల 12న తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. సన్నాహాల్లో బోర్డు..?
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలని అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితాల విడుదలలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2652 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగాయి. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వచ్చే వారంలో విద్యార్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఫలితాలను సైతం ఈనెల 13వ తేదీ లోపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలవ్వాల్సింది కానీ గతంలో దొర్లిన తప్పులు రిపీట్ అవ్వొద్దని అధికారులు భావిస్తున్నారు.