తెలంగాణ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల

by Mahesh |   ( Updated:2023-02-09 17:43:52.0  )
తెలంగాణ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యుల్ రిలీజ్ చేసింది.

ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరగనుందని ఎన్నికల సంఘం పేర్కొంది. సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం త్వరలో ముగియనుండగా మహబూబ్​నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది. నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రెండు స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాన్ని రసవత్తరంగా మార్చే అవకాశం ఉంది.

టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ సారి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తుండటంతో ఈ ఎన్నిక మరిత ఆసక్తిగా మారనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జనరల్ ఎలక్షన్ విధుల్లో టీచర్లే కీలకం కావడంతో అన్ని పార్టీలూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Advertisement

Next Story