TG Police: జైల్లో నుండి కాదు.. ఈ కొత్త ఏడాది ఆ పని చేయండి.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2025-01-02 15:28:30.0  )
TG Police: జైల్లో నుండి కాదు.. ఈ కొత్త ఏడాది ఆ పని చేయండి.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరం, పుట్టిన రోజు లాంటి వేడుకల్లో లక్ష్యాలు సాధించడం కోసం, పాత అలవాట్లు బంద్ పెట్టడం వంటి రకరకాల (Resolutions) రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే (Telangana Police Tweet) తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పంచుకుంది. మీ న్యూఇయర్ రిజల్యూషన్స్ ఏంటీ? అని ప్రశ్నించింది. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) చేయమని ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకోండి. స్నేహితులు, బంధువులకు అవగాహన కల్పించండి. 2025 నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆరంభించండి’ అంటూ తెలంగాణ పోలీస్ ట్వీట్‌లో పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల మీతో పాటూ ఎదుటివారికీ న‌ష్ట‌మే.. మీరు చేసే పొర‌పాటు కొన్ని కుటుంబాల‌ను చిదిమేస్తుంది.. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయ‌న‌ని కొత్త సంవ‌త్స‌రం రిజల్యూషన్ తీసుకోండని సూచించింది.

మరో ట్వీట్‌ చేస్తూ.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయడం, బైక్ లతో విన్యాసాలు, రోడ్లపై ఘర్షణ, మత్తులో సమాజానికి ఇబ్బంది కలిగే పనులు చేయకండని సూచించింది. కఠిన చట్టాలు కొత్త సంవత్సరంలో కటకటాల పాలయ్యేలా చేస్తాయని హెచ్చరించింది. మీ కొత్త సంవత్సరాన్ని బయట జనసమూహం నుంచి స్వాగతం పలకండి.. జైల్లో నుండి కాదు.. అంటూ తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Next Story

Most Viewed