హరీష్ రావు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం

by Gantepaka Srikanth |
హరీష్ రావు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు శుక్రవారం సంఘం ప్రకటన విడుదల చేసింది. కేవలం దురుద్దేశంతోనే హరీష్ రావు పోలీసులపై విమర్శలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి.. నేడు విమర్శలు చేయడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే సమర్థవంతమైన పేరు ఉందని గుర్తుచేశారు. రాజకీయ దురుద్దేశంతో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసం చేసే అసమంజస వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యం అయ్యాయని హరీష్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచారం కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల కాలంలో 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేశారని, బిహార్లో ఉండే నాటు తుపాకులు తెలంగాణ ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయని, లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed