- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవితకు శుభవార్త చెప్పిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర పోలీసులు శుభవార్త చెప్పారు. ఆమె చేపట్టిన భారత్ జాగృతి దీక్షకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారు.
కాగా, భారత జాగృతి దీక్షకు అనుమతివ్వండంటూ నిన్న డీజీపీ రవిగుప్తాకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ కవిత ఇవాళ దీక్ష తలపెట్టారు. అయితే, ముందుగా కవిత దీక్షకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు ఆలోచించారు. ఈ క్రమంలో డీజీపీకి కవిత ఫోన్ చేసి ఇది చాలా ముఖ్యమైన దీక్ష అని, దీంతో జీవో 3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందని రిక్వెస్ట్ చేయడంతో పాటు శాంతియుతంగానే తాము దీక్ష చేపడుతామని హామీ ఇవ్వడంతో డీజీపీ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.