Telangana DGP: వెయ్యి మంది పోలీసులతో భద్రత

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 15:50:52.0  )
Telangana DGP: వెయ్యి మంది పోలీసులతో భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురంబీం అసిఫాబాద్(Asifabad) జిల్లా జైనూర్(Jainoor) ఘటనపై తెలంగాణ పోలీస్(Telangana Police) శాఖ సీరియస్ అయింది. బుధవాం జైనూర్‌లో 144 సెక్షన్ విధించింది. వెయ్యి మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టొద్దని యువతకు డీజీపీ సూచించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం జైనూర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రత చర్యలు చూస్తోంది. అందరూ సంయమనం పాటించాలని డీజీపీ రిక్వెస్ట్ చేశారు. కాగా, జైనూర్‌(Jainoor)కు చెందిన ఆదివాసీ మహిళపై ఇటీవల అత్యాచారయత్నం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. నిందితుడి వర్గానికి చెందిన ఇళ్లు, దుకాణాలను తగులబెట్టారు. ఈ క్రమంలోఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ సైతం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాజకీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed