తస్మాత్ జాగ్రత్త: కొత్త నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తున్నారా..?

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-05 13:06:55.0  )
తస్మాత్ జాగ్రత్త: కొత్త నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న టెక్నాలజీ(Technology)తో పాటే సమాజంలో మోసాలూ భారీగా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్(Online games), ఫేక్ యాప్స్, ఫేక్ కాల్స్, ఫేక్ అకౌంట్స్, సైబర్ క్రైములు(Cybercrime) విపరీతంగా పెరిపోయాయి. ఈజీగా మనీ సంపాదించాలనే కోరిక ఉన్న వారే లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్(Cyber ​​criminals) రెచ్చిపోతున్నారు. ఈ తరహాలోనే సరికొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తాజాగా మరో కొత్త మోసానికి తెరలేపారు. మహిళలే లక్ష్యంగా చేసుకొని కొత్త ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్స్‌ చేస్తున్నారు. ఎవరు? అనుకొని లిఫ్ట్ చేయగా.. ఒక వ్యక్తి నగ్నంగా బట్టలిప్పుతూ కనిపిస్తాడు.

అదే సమయంలో సదరు నిందితులు వీడియో కాల్‌ను రికార్డ్ చేస్తారు. అనంతరం ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. డబ్బులు లాగే ప్లాన్ చేస్తారు. ఇలాంటి ఫేక్ కాల్స్‌పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) అప్రమత్తమైంది. మహిళలకు అవగాహన కల్పించేలా సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా బుధవారం పోస్టు పెట్టింది. ‘‘ఎవరైనా అపరిచిత నంబర్లనుండి వీడియో కాల్స్ వస్తే ఆ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయద్దు. ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లు న్యూడ్‌లో ఉండి రికార్డ్ చేస్తారు. ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసిస్తారు. తస్మాత్ జాగ్రత్త’ అని అప్రమత్తం చేశారు.

Click Here For Twitter Link





Advertisement

Next Story

Most Viewed