తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్.. ఆ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్

by Prasad Jukanti |   ( Updated:2024-05-13 14:31:56.0  )
తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్.. ఆ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనందున మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలతో పోలింగ్ క్లోజ్ అయింది. ఆ ఆసెంబ్లీ సెగ్మెంట్లు.. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని,భూపాలపల్లి, ములుగు, పినపాక ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాల్లో పోలింగ్ ముగిసింది. నాలుగు గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.

Read More..

‘సార్ స్టైలే వేరు’.. RTC బస్సులో వెళ్లి ఓటు వేసిన కాంగ్రెస్ మంత్రి

Advertisement

Next Story