సమ్మె విరమించిన తెలంగాణ జూడాలు

by M.Rajitha |
సమ్మె విరమించిన తెలంగాణ జూడాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత కొన్నిరోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. ఈరోజు సమ్మె విరమించారు. బెంగాల్ ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. వైద్యుల రక్షణ కోసం కొత్త చట్టం చేయాలంటూ ఆగస్ట్ 14 నుండి దేశవ్యాప్త సమ్మెకు దిగారు జూడాలు. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్ళి దర్యాప్తు జరుగుతుండగానే, సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. విచారణలో బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్.. జూనియర్ డాక్టర్లను సమ్మె విరమించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో తమ సమ్మె విరమించి వీధుల్లో చేరుతున్నారు వివిధ రాష్ట్రాల జూడాలు. తెలంగాణలో కూడా గత 10 రోజుల నుండి సమ్మెలో పాల్గొంటున్న జూడాలు, సమే విరమించి తిరిగి వీధుల్లో చేరారు. కాగా ఈ ఘటన అనంతరం ప్రతీ రాష్ట్రం విడిగా డాక్టర్ల రక్షణకు ఆయా ఆసుపత్రులు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.

Next Story

Most Viewed