- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణది 3వ స్థానం: మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: పేషెంట్లకు క్వాలిటీ వైద్యం అందివ్వాలని, అందుకు అవసరమైన సౌకర్యాలన్నీంటిని ప్రభుత్వం సమకూర్చుతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని సూచించారు. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యంతో పాటు బోధన పరిశోధనపై దృష్టి సారించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అతి తక్కువ సమయంలో21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది అన్నారు. అంతేగాక ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయినట్లు చెప్పారు.
వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదన్నారు. ఇవన్నీ సిబ్బంది చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు. ఫస్ట్‌ప్లేస్‌లోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రోల్ మోడల్‌గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలన్నారు. క్రమశిక్షణగా ఉండి, ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలన్నారు. క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెందెంట్స్‌దే పూర్తి బాధ్యత అన్నారు. రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఫ్యామిలీ వెల్ఫేర్కమిషనర్శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్విజిట్.. సింగర్‌కు పరామర్శ..
జూన్ 14 వైద్యరోగ్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భూమి పూజ చేసే నిమ్స్ కొత్త బ్లాక్ వద్ద వైద్యారోగ్యశాఖ, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి మంత్రి హరీష్‌రావు ఏర్పాట్లు పరిశీలించారు. రూ.1571 కోట్లతో నిర్మించబోయే 2000 పడకల ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉద్యమ సమయంలో పాట ద్వారా చేసిన సేవలు మరిచిపోలేమని మంత్రి గుర్తు చేశారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.